పాత రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవచ్చా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

2016లో రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను మళ్ళీ మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. PIB Fact Check ప్రకారం, ఈ వార్తలు ఫేక్ అని, ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలు తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయవద్దని, నోట్లకు సంబంధించిన సమాచారం కోసం https://rbi.org.in/ ను సందర్శించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్