నోటీసు లేకుండా విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం చట్టవిరుద్ధం!

బిజీ జీవితంలో విద్యుత్ బిల్లు చెల్లించడం మర్చిపోతే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీటర్ ఫీజు తీయడం, కనెక్షన్ కట్ చేయడం చట్టవిరుద్ధమని ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 చెబుతోంది. సెక్షన్ 56(1) ప్రకారం, బిల్లు చెల్లించనప్పుడు కనెక్షన్ కట్ చేయడానికి కనీసం 15 రోజుల ముందు వినియోగదారుడికి రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. ఈ నోటీసులో బిల్లు చెల్లించకపోవడానికి గల కారణం, కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నారో వివరించాలి. ఆన్‌లైన్ పేమెంట్లలో టెక్నికల్ సమస్యల వల్ల బిల్లు అప్‌డేట్ కాకపోయినా కనెక్షన్ కట్ చేస్తే అది తీవ్రమైన ఉల్లంఘన. ఫిబ్రవరి 2026లో ఏపీ హైకోర్టు కూడా నోటీసు ఇవ్వకుండా కనెక్షన్ కట్ చేయడం ఆర్టికల్ 21, 19 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్