బ్యాట్ పట్టుకోవడం రానివారు క్రికెట్ సంఘాలను నడుపుతారా?: సుప్రీం కోర్టు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియని వారు సంఘాలను నడపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, క్రీడాకారులే సంఘాలను నిర్వహించాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) ఎన్నికల స్టే ఎత్తివేతను నిరాకరిస్తూ, అభ్యంతరాల కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాలంది. క్రీడల్లో రాజకీయ జోక్యం కంటే నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్