రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాల్లో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలు: మంత్రి

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిమ్స్, ఉస్మానియా స్థాయి వసతులు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాల్లో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో అన్ని వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్