దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులు ఎదుర్కొంటున్న మందుల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైన రెండు కీమోథెరపీ మందులు, రెండు ధనుర్వాతం ఇంజెక్షన్ల ధరలను పెంచేందుకు ఎన్‌పీపీఏకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం, దిగుమతి సుంకాలు, కరెన్సీ మార్పిడి విలువల హెచ్చుతగ్గుల వల్ల తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఉత్పత్తి నిలిపివేశాయి. ధరల పెంపుతో ఉత్పత్తి పుంజుకుని, మందులు అందుబాటులోకి రానున్నాయి. ప్లాటినం ఆధారిత కీమోథెరపీ మందుల ధరలు 10-50% వరకు పెరగనున్నాయి.