గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

కెనడాలో ఉంటూ భారత్‌లో నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు తీసుకుంది. ఆయనను ఉగ్రవాదిగా సోమవారం ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటించారు. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి కుడి భుజంగా గోల్డీ వ్యవహరిస్తున్నాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా పరిగణించబడ్డాడు.