గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు జూన్ 30లోపు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలని చమురు సంస్థలు తెలిపాయి. ఇప్పటివరకు e-KYC చేయని వారు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది లేదా సంబంధిత మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. గడువులోపు e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ అందేలా, నకిలీ, బహుళ కనెక్షన్లను గుర్తించి అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.