ఆధార్ వినియోగంలో కేంద్రం కీలక మార్పులు: త్వరలో ఆఫ్‌లైన్ వెరిఫికేషన్

కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగంలో కీలక మార్పులు చేయనుంది. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, అపార్టుమెంట్లలో ప్రవేశానికి ఆధార్ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఇందుకు  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను తీసుకురానుంది. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. కొత్త విధానంలో ఆధార్ కార్డుపై పూర్తి వివరాలు లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా మార్పులు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్