భారతదేశానికి వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రయాణానికి 24 గంటల ముందు హెల్త్ డిక్లరేషన్, గత 21 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య వివరాలు, ఎబోలా ప్రభావిత దేశాల సందర్శన వంటి సమాచారాన్ని నమోదు చేయడం తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం. WHO సూచనల మేరకు, ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని విమానాశ్రయంలో చూపించాలి.