గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధార పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని, 2035 నాటికి 900 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,86,405 కోట్లతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనుండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.54,082 కోట్లుగా ఉంది.