వివాదాస్పద FCRA సవరణ బిల్లు-2026ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మైనారిటీలు, ఎన్జీవోల హక్కులను దెబ్బతీసే చట్టమని వారు ఆరోపించారు. దీంతో కేంద్రం బిల్లును నిలిపివేసింది.