స్థూలకాయం చికిత్సలో వాడే GLP-1 ఆధారిత మందుల (సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్)పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ మందులను సాధారణ బరువు తగ్గించే టానిక్‌లా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని, కేవలం వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) హెచ్చరించింది. క్లినిక్‌లు, ఫార్మసీలలో తనిఖీలు నిర్వహించి, అనధికారిక విక్రయాలు జరిగితే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపింది.