టీవీ ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్

దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం-1995 లోని నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. వార్తల ప్రసారంలో బాధ్యతాయుతంగా ఉండాలని, ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారాలు, హింసాత్మక దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలను నివారించాలని సూచించింది. లైంగిక బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలని, మ్యాప్‌లను ప్రసారం చేసేటప్పుడు ప్రామాణికమైన వాటినే వాడాలని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕