నేటి నుంచి అమలులోకి సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్

TG: రైతుల సౌకర్యార్థం కేంద్రం తీసుకొచ్చిన సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో రైతులు ఇంటివద్ద నుంచే యూరియాతో పాటు డీఏపీ, తదితర కాంప్లెక్స్ ఎరువులు యాప్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ యాప్‌ను ఉపయోగించేందుకు రైతు రిజిస్ట్రేషన్, ఆధార్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతుకు ఒక ఐడి కేటాయింపు ఉంటుంది. రైతు భరోసా, రైతు సంక్షేమ పథకాలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్