ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌ సిస్టమ్‌కు కేంద్రం ఆమోదం

ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) అమలుకు ఆమోదం తెలిపింది. ఈ వ్యవస్థ ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లలో 24 నెలల్లో మూడు దశల్లో అమలు చేయబడుతుంది. ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అంబులెన్సులకు గ్రీన్ కారిడార్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను తక్షణమే గుర్తించి, రాంగ్ రూట్, స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలను టెక్నాలజీతో గుర్తించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕