పంచాయతీలకు రూ.3 వేల కోట్లు.. విడుదలపై కేంద్రం షరతులు

TG: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన రూ.3 వేల కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా షరతు పెట్టింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్