సీఎంతో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ భేటీ

సీఎం రేవంత్‌తో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ మహేంద్ర దేవ్ భేటీ అయ్యారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లే అంశంపై చర్చించారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. HYDతో పాటు రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు.

సంబంధిత పోస్ట్