AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పని చేశారన్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ, జేఈవోను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.