UPIలో ఆగస్టు 1 నుంచి కొత్త నియమాలు అమలుకానున్నాయి. ఇక నుంచి యూపీఐ వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంటుంది. ప్రత్యేకంగా PhonePe, Google Pay, Paytm లాంటి యాప్స్‌లో ఇది వర్తిస్తుంది. ఇది పేమెంట్ సర్వర్‌లపై ఒత్తిడిని తగ్గించి, చెల్లింపులను సులభతరం చేస్తుంది. దీని వల్ల యూపీఐ సేవ మరింత స్థిరంగా, వేగంగా పనిచేస్తుంది.