TG: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 10 నుంచి 17 వరకు దరఖాస్తుల స్వీకరించాల్సి ఉండగా.. తాజాగా వైద్యుల విజ్ఞప్తి మేరకు మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ తేదీల్లో మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి 27 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకోనున్నట్లుగా శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.