SBI ఎంపిక చేసిన ఎలైట్, ప్రైమ్ క్రెడిట్ కార్డులపై ఉన్న ఉచిత విమాన ప్రమాద బీమా కవర్‌ను ఆగస్టు 11 నుంచి నిలిపివేయనుంది. గతంలో SBI, UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, PSB, కరూర్ వైశ్య, అలహాబాద్ బ్యాంక్ కార్డులపై రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బీమా కవర్ అయ్యేది. అయితే ఈ ఉచిత బీమా ఆగస్టు 11 నుంచి SBI, ఇతర కో-బ్రాండెడ్ కార్డులపై అందుబాటులో ఉండదు. ఇది ఆగస్టు 1 నుంచి కాకుండా 11 నుంచి అమల్లోకి రానుంది.