HDFC బ్యాంక్ లాకర్ అద్దెల్లో భారీ పెరుగుదల!

ప్రైవేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంక్ తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. బ్యాంక్ తన లాకర్ అద్దెలను 184% వరకు పెంచింది. ముఖ్యంగా ఎక్స్‌ట్రా మీడియం లాకర్ల అద్దె మెట్రో నగరాల్లో రూ.4,400 నుండి రూ.12,500కు, ఎక్స్‌ట్రా స్మాల్ లాకర్ల అద్దె రూ.1,350 నుండి రూ.3,300కు పెరిగింది. కొత్త ప్రీమియం కేటగిరీ 'మెట్రో ప్లస్'లో అదనపు-పెద్ద లాకర్లకు సంవత్సరానికి రూ.40,000 వరకు ఛార్జీలు ఉంటాయి. ఏప్రిల్ 1 నుండి UPI ద్వారా ATMల నుండి నగదు ఉపసంహరణలు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించబడతాయి.

సంబంధిత పోస్ట్