తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. గణేష్ నిమజ్జన బందోబస్తు, ఇతర అత్యవసర విధుల్లో అధికారులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెర్ప్ సీఈవో దివ్య సర్క్యులర్ జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వెరిఫికేషన్‌ను 100% పూర్తి చేసి, అర్హులైన ప్రతి పేదవాడికి పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.