ఇన్‌స్టాలో చైల్డ్ అబ్యూస్ యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన (CSEAM) కంటెంట్ ప్రాచుర్యం పొందుతోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వివాదాస్పద కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, ఈ అంశంపై 7 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. గడువులోగా వివరణ ఇవ్వకపోతే ఐటీ చట్టం, పోక్సో చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. బీబీసీ కథనం వెలువడిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్