తండ్రి ఆస్తిపై రెండో భార్య పిల్లలకూ సమాన హక్కు: హైకోర్టు

AP: తండ్రికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో మొదటి భార్య పిల్లలతో పాటు రెండో భార్య సంతానానికి కూడా సమాన హక్కు ఉంటుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మొదటి భార్య మరణానంతరం రెండో వివాహం చేసుకున్నారని, తద్వారా జన్మించిన కుమార్తెలు చట్టబద్ధ సంతానమేనని, ఆస్తిపై వారికీ సమాన హక్కు ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. తురంగి సోమరాజు ఆస్తులకు సంబంధించి ఆయన కుమారుడు సత్యనారాయణ దాఖలు చేసిన రెండో అప్పీల్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఈ తీర్పు వెలువరించారు. రూ.80 వేలు తీసుకుని ఆస్తిపై హక్కులు వదులుకున్నారన్న సత్యనారాయణ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్