అల్జీమర్స్‌కు సంబంధించిన ఎల్‌వీఏ అనే సర్జరీ విధానంలో చైనాలో పలు ఆసుపత్రులు విస్తృతంగా చికిత్స అందిస్తున్నాయి. తాజాగా ఈ సర్జరీపై జాతీయ వైద్య విభాగం నిషేధాన్ని విధించింది. దీనికి స్పష్టమైన ఆధారాల్లేవని పేర్కొంది. దీంతో నాలుగేళ్లుగా దాదాపు 400 ఆసుపత్రుల్లో చేపట్టిన శస్త్రచికిత్సా విధానానికి బ్రేక్ పడినట్లయ్యింది. కాగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన మైక్రో సర్జన్ అల్జీమర్స్‌కు 2021లో తొలిసారి ఈ విధానంలో చికిత్స చేశాడు.