ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక అస్థిరత సమయంలో బంగారం సంపదకు చిహ్నంగా నిలుస్తోంది. 2024లో చైనా 370 మెట్రిక్ టన్నుల బంగారంతో ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. రష్యా 310 మెట్రిక్ టన్నులు, ఆస్ట్రేలియా 300 మెట్రిక్ టన్నులు, కెనడా 200 మెట్రిక్ టన్నులు, అమెరికా 170 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తి చేశాయి. చైనా తన డిమాండ్‌ను తీర్చడంతో పాటు భారీగా ఎగుమతి కూడా చేస్తోంది. రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా కూడా బంగారం ఉత్పత్తిలో తమదైన స్థానాన్ని కలిగి ఉన్నాయి.