అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం చొరబడి, శిబిరాలు ఏర్పాటు చేసిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను భారత సైన్యం సోమవారం ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా ఆధార రహితమని, సరిహద్దుల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదని సైన్యం స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్లోని తక్సింగ్ ప్రాంతంలో పలుచోట్ల చైనా బలగాలు రోడ్లు, క్యాంపులు నిర్మించాయంటూ 'నా వెల్ఫేర్ సొసైటీ' అనే స్థానిక సామాజిక సంస్థ జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన మెమోరాండం ఆధారంగా ఈ వార్తలు వచ్చాయంది. అయితే అవి వాస్తవం కాదని సైన్యం తేల్చి చెప్పింది.