సిగరెట్ల ధరలు పెంపు.. రేపటి నుంచి కొత్త పన్నుల అమలు

ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సిగరెట్ల పొడవు ఆధారంగా పన్నులు మారతాయి. 65 మి.మీ. వరకు ఉన్న సిగరెట్లకు రూ.2.05, 70-75 మి.మీ. సిగరెట్లకు రూ.5.4, ప్రత్యేక డిజైన్ల సిగరెట్లకు రూ.8.50 వరకు పన్ను విధించనున్నారు. నమలడం పొగాకు, జర్దాపై 82%, గుట్కాపై 91% వరకు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై 88% వరకు మొత్తం పన్ను భారం ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి MRP ఆధారిత ధరల విధానం అమలులోకి రానుంది.

సంబంధిత పోస్ట్