దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల మూసివేత

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నెల 15 వరకు 24 ఎయిర్‌పోర్టులు బంద్ కానున్నాయి. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని ఎయిర్‌పోర్టులను మూసివేయనున్నారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, ధర్మశాల, బటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, లేహ్, బికనీర్, పఠాన్‌కోట్, జమ్మూ, జామ్‌నగర్, భుజ్ ఎయిర్‌పోర్టులు మూసివేయనున్నారు.

సంబంధిత పోస్ట్