తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఈ భేటీ చర్చించనుంది. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశం నిర్వహించి వీటిని సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలపైనా సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందనుంది.