తెలంగాణలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ‘నూతన రేషన్ కార్డుల పంపిణీ’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేషన్‌కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు అని పేర్కొన్నారు. రేషన్‌కార్డు పేదవాడి ఆకలి తీర్చే ఆయుధమని చెప్పారు.