సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (C) తిరుమలగిరి మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంతో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.