సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌తో ప్రయాణించారు. తన కాన్వాయ్ కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ చర్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలనే ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది.