తెలంగాణ కవులు, కళాకారులను ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు స్థూపం రూపొందించిన ఎక్కా యాదగిరికి ఫోర్త్ సిటీలో 300 గజాల స్థలంతో పాటు రూ.కోటి నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ కవులు గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం 9 మంది కవులకు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, రూ.కోటి నగదు అందజేస్తామన్నారు.