తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం ‘షీల్డ్ 2.0’ కార్యక్రమం జరగనుంది. జాతీయస్థాయి సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ‘సైఫర్ స్ప్రింట్’లో భాగంగా ‘బాధితులకు రక్షణ.. డిజిటల్ భవిష్యత్తుకు భద్రత’ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. రాష్ట్ర సాంకేతిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడంతోపాటు సైబర్ రంగంలో వినూత్న ఆవిష్కరణల్ని ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు ఉండనుంది.