తొలిసారి ట్రాన్స్‌జెండర్ మహిళకు CMRF ఆర్థిక సాయం

TG: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ట్రాన్స్‌జెండర్ మహిళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం అందింది. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సీఎం రేవంత్‌ ఆదేశాలతో నిధుల మంజూరయ్యాయి. ట్రాన్స్‌జెండార్‌ సంక్షేమం, ఆరోగ్య హక్కులు, సమాన అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో ఉందని క్వీర్‌ బంధు పేరెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఇది గౌరవప్రద జీవనానికి మరో ముందడుగు అని, శస్త్రచికిత్స విజయవంతం కావడంతో అసోసియేషన్‌ ప్రతినిధులు ఓఎస్డీ వేముల శ్రీనివాసులను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్