కాగ్నిజెంట్ 100% బోనస్.. టెక్కీలకు తీపి కబురు!

ఐటీ రంగంలో ఉద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను తమ సిబ్బందికి 100 శాతం బోనస్ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే చేరుకోవడం, ఆదాయ వృద్ధిలో తోటి ఐటీ దిగ్గజాలను అధిగమించడం వంటి కారణాలతో ఈ భారీ బోనస్‌ను ప్రకటించారు. ముఖ్యంగా AI విభాగంలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఫలితాలనిస్తున్నాయని వర్గాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్