పెళ్లి వయసు రాకపోయినా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

రాజస్థాన్ హైకోర్టు లివిన్ రిలేషన్‌షిప్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చని, వారికి పెళ్లి వయసు రాకపోయినా ఆ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. పెళ్లి వయసు నెపంతో రాజ్యాంగ హక్కులను నిరాకరించలేమని జస్టిస్ అనూప్ ధండ్ తన తీర్పులో పేర్కొన్నారు. 18 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల అబ్బాయి తమ సంబంధం గురించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 అక్టోబర్ 27న సహజీవనం చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్