కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు (VIDEO)

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసి సారాంశాన్ని ఈనెల 4న కేబినెట్‌కు సమర్పించనుంది. కాగా, కాసేపటిక్రితమే సీఎం రేవంత్‌రెడ్డికి కాళేశ్వరం కమిషన్‌ నివేదికను మంత్రి ఉత్తమ్‌ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్