TG: ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ఒకే చోట అందించేందుకు ప్రభుత్వం 'సమగ్ర సంక్షేమ కార్డు' (యూనిఫైడ్ కార్డ్)ను తీసుకురానుంది. ఈ కార్డు ద్వారా లబ్ధిదారులు తాము ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకోవచ్చు. అన్ని శాఖల లబ్ధిదారుల డేటాను సమీకరించి, పారదర్శకంగా సంక్షేమ సేవలు అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్డు అమలుతో సంక్షేమ పథకాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని తెలిపారు.