రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత కూడా ఖాళీగా ఉండే బెర్త్‌లను 'కరెంట్ బుకింగ్' (Current Booking) ద్వారా పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ విధానంలో కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే లభిస్తాయి. RAC లేదా వెయిటింగ్ లిస్ట్ ఇవ్వరు. ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేయడం వల్ల ఖాళీ అయ్యే సీట్లను ఇందులోకి తెస్తారు. మొదటి చార్ట్ బయలుదేరడానికి 10 గంటల ముందు (లేదా ముందు రోజు రాత్రి), చివరి చార్ట్ 30 నిమిషాల ముందు సిద్ధమవుతుంది. సీట్ల లభ్యతను బట్టే ఇది సాధ్యమవుతుంది; అన్ని రైళ్లలోనూ ఖాళీలు ఉంటాయని చెప్పలేం.