ఓటరు సర్వే ఫారాలపై గందరగోళం.. ఇబ్బందుల్లో ఓటర్లు

అర్హులైన వారికి మాత్రమే ఓటుహక్కు కల్పించే సమగ్ర సవరణ (సర్‌)పై ఓటర్లకు అవగాహన లోపించింది. బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) ఇచ్చే ఫారాలు నింపడంలో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. బీఎల్‌వోలు కూడా ఓటర్ల సందేహాలు తీర్చలేక గందరగోళానికి గురవుతున్నారు. వాటిని ఎలా పూరించాలో అర్థంకాక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. సహాయక కేంద్రాలు కూడా స్థానిక బీఎల్‌వోలనే సంప్రదించమని చెబుతున్నాయి. గుర్తింపు కార్డులు లేవని, చనిపోయిన తల్లిదండ్రుల కార్డులు ఎక్కడి నుంచి తేవాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఫారం నింపడంపై మరింత అవగాహన కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్