కల్యాణ లక్ష్మీ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వివాహాలకు ఆర్థిక సాయం అందించే కల్యాణ లక్ష్మీ పథకం అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2014లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 12 లక్షల మంది లబ్ధి పొందగా, ప్రభుత్వం సుమారు రూ. 12-14 వేల కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కల్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించినా, రెండున్నరేళ్లు గడిచినా ఈ హామీ అమలులో ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.

సంబంధిత పోస్ట్