దేశవ్యాప్తంగా యువతుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీని అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. హ్యుమన్ ట్రాఫికింగ్ క్షమించరాని నేరమని, మహిళలు, మైనర్లను రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య తేడాను గుర్తించాలని, స్వచ్ఛంద సెక్స్ వర్కర్లను వేధించవద్దని, వారిపై కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని తెలిపింది. అయితే, హ్యూమన్ ట్రాఫికింగ్‌తో లైంగిక దోపిడీ శిక్షార్హమని పేర్కొంది.