కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇక పై 1వ తేదీనే జీతాలు

TG: రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది. ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని  నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే నెల నుంచి ఇది పక్కాగా అమలు చేయాలని, ఏప్రిల్ నెల జీతం మే 1వ తేదీన ఖాతాల్లో వేయాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. కాగా గతంలో వీరు జీతాల కోసం ప్రతి నెలా 20వ తేదీ వరకు ఎదురుచూసే పరిస్థితి ఉండేది.

సంబంధిత పోస్ట్