TG: రాష్ట్రంలో ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బుధవారం ఒకటో తేదీనే ఖాతాల్లో జీతాలు పడ్డాయి. సీఎం రేవంత్ ఆదేశాలతో ఆర్థిక శాఖ ఈ మేరకు జీతాలు వేసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు జమ చేసింది. అన్ని విభాగాల ఉద్యోగులకు ఇవాళే జీతాలు ఇచ్చినట్లు సీఎంకు ఆర్థిక శాఖ వెల్లడించింది.