సూక్ష్మ యూనిట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు (31 మార్చి 2031) వరకు పొడిగిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పొడిగింపు ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలో రూ.12.6 లక్షల కోట్ల విలువైన రుణాలకు క్రెడిట్ గ్యారెంటీ (రుణ హామీ) లభించనుంది. ముద్రా యోజన, చిన్న తరహా వ్యాపారాలకు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు అందేలా కేంద్రం ఊతం ఇవ్వనుంది.