కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు, పలు ఆర్థిక నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా, క్రెడిట్ స్కోరు అప్‌డేట్ వ్యవధిలో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ అయ్యే క్రెడిట్ స్కోరు ఇకపై వారానికి ఒకసారి అప్‌డేట్ అవుతుంది. ఈ మార్పుల వల్ల, రుణ చెల్లింపుల్లో జాప్యం చేసేవారిపై తక్షణ ప్రభావం పడే అవకాశం ఉంది.