TG: ఓ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరులో సభలో కొడుకు లండన్‌లో జాబ్ చేస్తున్నాడని, కూతురు కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుందని, తనకు ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని ఆ మహిళ తెలిపారు. అయితే కొడుకు, కూతురు మంచి ఉద్యాగాలు చేస్తున్నప్పటికీ అర్హురాలిగా గుర్తించి ఇల్లు కేటాయించడంపై విమర్శలు చేస్తున్నారు.